గిద్దలూరు: గిద్దలూరులో కదం తొక్కిన వైసీపీ నాయకులు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఇన్ ఛార్జ్ నాగార్జున రెడ్డి
రెండేళ్ల కూటమిపాలనలో ప్రజలకు వెన్నుపోటు తప్ప ఒరిగిందేమీ లేదని మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో వైసిపి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. వైయస్సార్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కూటమి మ్యానిఫెస్టోను తగలబెట్టి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలలో ఒకటి కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని నాగార్జున రెడ్డి విమర్శించారు. జగనన్న హయాంలో హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా యువతకు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.