యర్రగొండపాలెం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వై పాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. డీజిల్ నిత్యావసర ధరలు పెరిగిపోయాయి అన్నారు. పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు అన్నారు. ప్రభుత్వం వెంటనే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని పిలుపునిచ్చారు.