రాయదుర్గం: కూటమి నేతల మద్య ఘర్షణ శాంతిభద్రతల వైఫల్యంగా అభివర్ణించిన వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి
రాయదుర్గం పట్టణంలో ఆదివారం సాయంత్రం లక్ష్మీబజార్ పెట్రోల్ బంకు వద్ద బహిరంగంగా కూటమి నాయకుల మద్య జరిగిన దాడులు శాంతి భద్రతల వైఫల్యంగా YCP నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన భైరవానితిప్ప ప్రాజెక్టు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు, TDP నేత బుడిమేపల్లి సుభాన్, మాజీ MLA కాపు రామచంద్రారెడ్డి అనుచరుడిగా ఉండి చాలా కాలం క్రితమే వైసీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న బోరువెల్ నాగిరెడ్డి మధ్య జరిగిన గొడవను వైసీపీకి అంటగట్టేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు చేయడం తగదన్నారు.