గిద్దలూరు: మార్కాపురం జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులను అదుపులోకి తీసుకున్న అర్ధవీడు పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడు పోలీసులు ముగ్గురు భవన నిర్మాణ కార్మికులను దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కంభం సర్కిల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో సురేష్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనం కేసులో 120 గ్రాముల బంగారం, రూ. 50వేల నగదు దొంగిలించబడ్డాయని డిఎస్పీ తెలిపారు. నిందితులపై మరో నాలుగు దొంగతనం కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.