మార్కాపురం: పొదిలి మండలంలో రాత్రిపూట బయట నిద్రించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఎస్సై రాజేష్
మార్కాపురం జిల్లా పొదిలి మండలంలోని ప్రజలు వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. రాత్రిపూట ఆరుబయట నిద్రించేవారు తమ ఇంటికి కచ్చితంగా తాళాలు వేసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా పనిమీద ఊరికి వెళ్లేటప్పుడు విలువైన బంగారు వెండి ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. గ్రామాలలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.