దర్శి: గుంటి గంగమ్మ తిరణాలకు స్వయంగా ప్రభను తీసుకెళ్తున్న శివరామపురం గ్రామస్తులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామంలో జనసేన పార్టీ ప్రభ గుంటి గంగమ్మ తిరునాళ్లకు బయలుదేరింది. అన్ని ప్రాంతాలలో ట్రాలీ లారీలో ప్రభలు తీసుకొస్తుంటారు. కానీ శివరాంపురం ప్రజలు స్వయంగా లాక్కొని గంగమ్మ తిరునాళ్లకు తీసుకెళ్లడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. తిరునాళ్లకు ఏడు విద్యుత్ ప్రభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టిడిపి నాలుగు వైసీపీ రెండు జనసేన పార్టీ ఒక ప్రభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు.