కొండపి: సింగరాయకొండ సోమరాజు పల్లి లో వైసిపి పై విరుచుకుపడ్డ మంత్రి స్వామి, ఉనికిని కాపాడుకునేందుకు అనవసరమైన ఆరోపణలన్న మంత్రి
పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ పదేపదే డీఎస్సీపై ఆరోపణలు చేస్తోందని మంత్రి స్వామి అన్నారు. సింగరాయకొండలోని సోమరాజు పల్లి గ్రామంలో సోమవారం పింఛన్ పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీని ప్రభుత్వం నిర్వహించిందన్నారు. నిరుద్యోగులకు మేలు జరిగే పనిని వైసీపీ ఒప్పుకోదన్న భావన మరో మారు తేటతెల్లమవుతోందని విమర్శించారు.