రాయదుర్గం: గొల్లపల్లి గ్రామంలో రెండు ఇళ్లలో చోరీ
*గుమ్మగట్టలో అర్ధరాత్రి చోరీలు కలకలం* గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి ఇంటి ప్రధాన గ్రిల్‌ను కట్టర్ సహాయంతో తొలగించి లోపలికి చొరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి అందులోని వస్తువులు అపహరించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కాంతారెడ్డి ఇంటి తాళాలు కూడా పగులగొట్టి లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఇద్దరి కుటుంబాలు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎంత సొత్తు పోయిందనే విషయం ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న గుమ్మగట్ట పోలీసులు సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.