కొండపి: ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలకు సైబర్ నేరాలు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన పోలీసులు
ప్రకాశం జిల్లా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మహిళలకు సైబర్ నేరాలు మత్తు పదార్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని అలానే సైబర్ నేరాలపై మహిళలకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు. శక్తి యాప్ ద్వారా కలుగు ప్రయోజనాలను మహిళలకు వివరించి వారి స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే వెంటనే పోలీసులు వారి వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని పోలీసులు వారికి తెలిపారు.