రాయదుర్గం: ఆర్థిక ఇబ్బందుల్లోనూ రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్న సిఎం చంద్రబాబు : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
ఆర్థిక ఇబ్బందుల్లోనూ రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అన్నారు. బొమ్మనహల్ లో రూ. 6 కోట్లతో చేపట్టిన సిసి రోడ్డు, గుండ్లపల్లి ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజ చేశారు. రాయదుర్గం - బళ్ళారి రోడ్డు, అలాగే బొమ్మనహాల్ గుండ్లపల్లి రోడ్డు సహా వివిధ గ్రామాల ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.