కళ్యాణదుర్గం: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టీ టీ డీ చైర్మన్ బీ ఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ రంగయ్య
కూటమి ప్రభుత్వానికి ఆదిదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని, టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని వైసీపీ నాయకులు కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పూజలు చేశారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు దేవాలయానికి వెళ్లారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బీ ఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీ ఆర్ నాయుడు లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడం మన దురదృష్టమన్నారు.