Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పబ్లిక్ యాప్ కథనానికి స్పందన, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎంపిడిఓ కొండన్న

Rayadurg, Anantapur | Jun 3, 2026
'కదిరంపల్లి ఎస్సీ కాలనీలో ఇళ్ల ముందు కదలని వర్షపు నీరు, దుర్గంధంతో స్థానికుల ఇక్కట్లు' అనే Public App కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. రాయదుర్గం మండలం కదిరంపల్లి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు, వర్షపు నీరు ఇళ్ల ముందు నిలిచి దుర్గంధం వెదజల్లుతోందని, దీనివల్ల అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం ఉందని మంగళవారం వార్త ప్రచురితమైంది. స్పందించిన ఎంపీడీవో కొండన్న, ఏఎస్ఐ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి బుధవారం కాలనీని సందర్శించి పరిశీలించారు. నీరు వెళ్లేలా చర్యలు చేపట్టేందుకు కొందరు సహకరించకపోవడంతో వారికి ఎంపీడీవో అవగాహన కల్పించారు.
రాయదుర్గం: పబ్లిక్ యాప్ కథనానికి స్పందన, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎంపిడిఓ కొండన్న - Rayadurg News