కొండపి: కరవాది సమీపంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా కరవాది సమీపంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో వర్షం పడుతున్న కారణంగా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై ఓ చెట్టు కిందకు వెళ్లారు. పిడుగు పడటంతో కొత్తపట్నం మండలానికి చెందిన కొండలరావు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.