యర్రగొండపాలెం: మాజీ గవర్నర్ రోశయ్యకు ఘన నివాళులర్పించిన వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొనిజేటి రోశయ్య 91వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.