యర్రగొండపాలెం: జులై చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు టన్నెలు -2 పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలో గత 20 నెలల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు టన్నెలు-2లో 5.2 కిలోమీటర్లు లైనింగ్ పనులు పూర్తి చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు. అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. జూన్ 10 నాటికి బెంచింగ్ పనులు, జూలై చివరి నాటికి మిగిలిన 1.7 కిలోమీటర్లు లైనింగ్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.