మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఎండ తీవ్రతతో జనసంచారం లేక నిర్మానుషంగా మారిన ప్రధాన వీధులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదు అయింది. తీవ్ర వేడి ఉండడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఎప్పుడు రద్దీగా ఉండే పలు వీధులు బోసిపోయాయి ఎండ దెబ్బకు బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. వ్యాపారాలు మందగించడంతో తోపుడుబండ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరించారు.