మార్కాపురం: జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని విద్యుత్ నీటి సౌకర్యం అలాగే విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో 22 కేంద్రాలలో 9502 మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్ష రాయబోతున్నారన్నారు.