చిల్పూర్: జనగామ జిల్లాలో పట్టుబడిన అక్రమ బియ్యం: నిందితుడు అరెస్ట్
జనగామ జిల్లా చిల్పూరులో అక్రమంగా తరలిస్తున్న 6.68 క్వింటాళ్ల బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుస్నాబాద్‌కు చెందిన చెన్నూరి సమ్మయ్యను అదుపులోకి తీసుకుని, ఆటోను, బియ్యాన్ని చిల్పూరు పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.22,210.