చిల్పూర్: చిన్నపెండ్యాల, నష్కల్ లో నూతంగా మంజూరు అయిన ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి,పనులను ప్రారంభించిన mla
గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో 20లక్షల వ్యయంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు. చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాలలో నూతంగా మంజూరు అయిన ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోజు శంకుస్థాపన చేసుకున్న ఆరోగ్య ఉప కేంద్రాలను 6నెలల్లో పూర్తి చేసి చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాల ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారూ