గిద్దలూరు: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలోని చెరువులో భారీ తుమ్మ చెట్లను నరికి తీసుకువెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలోని చెరువులో భారీ తుమ్మ చెట్లను నరికి గుర్తుతెలియ వ్యక్తులు యంత్రాల సహాయంతో తీసుకువెళ్లారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి రావడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పట్టపగలే ఇలా తుమ్మ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి తీసుకువెళ్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.