రాయదుర్గం: పట్టణంలోని ప్రధాన వీధుల్లో పశువుల స్వైరవిహారంతో జనం బెంబేలు
*రాయదుర్గం రోడ్లపై పశువుల స్వైరవిహారం* రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఆవులు, గాడిదల స్వేచ్ఛా సంచారం వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల బళ్లారి రోడ్డు, వినాయక కూడలి, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో పశువులు పోట్లాడుకుంటూ మీదకు రావడంతో పలువురు ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. బుధవారం కూడా లక్ష్మీబజార్‌లో నడిరోడ్డుపై పెద్ద కొమ్ములు గల రెండు ఆవులు పోట్లాడుకుంటూ జనం మీదకు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మున్సిపల్ అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.