మార్కాపురం: జమ్మనపల్లి గ్రామంలో నిరుపయోగంగా మారిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం
మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామంలో 2018 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు అది నిరుపయోగంగా మారింది. మరోవైపు మూగజీవాలకి ఏర్పాటు చేసిన నీటి తొట్టిలు పగిలిపోయాయి. ఇవి సైతం ఉపయోగం లో లేకపోవడంతో ప్రజాధనం వృధా అవుతుందని గ్రామస్తులు విమర్శించారు.