ఉరవకొండ: బెలుగుప్పలో ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్, టోర్నీ విజేతగా గుండ్లపల్లి
బెలుగుప్పలోని ఎన్టీఆర్ గ్రౌండ్లో సన్రైజర్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచి 14వ తేదీ (మంగళవారం) వరకు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఫైనల్లో గుండ్లపల్లి-కళ్యాణం దుర్గం జట్లు తలపడ్డాయి. గుండ్లపల్లి జట్టు కళ్యాణదుర్గం పై 22 పరుగులు తేడాతో విజయం సాధించింది. విజేతలకు ఎస్ఐ శివ, మండల విద్యాశాఖ అధికారి హరికృష్ణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సన్రైజర్స్ స్కూల్ యాజమాన్యం, క్రీడాకారులు పాల్గొన్నారు.