గిద్దలూరు: కొమరోలు మండలం ఎడమకల్లు క్రాస్ రోడ్డు సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి మరో ఆరుగురికి గాయాలు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడ్డ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కొమరోలు మండలం మధవపల్లి గ్రామానికి చెందిన చిన్న సుబ్బమ్మ మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్లలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదం పై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.