గిద్దలూరు: రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుములవీడు గ్రామంలో శనివారం సిఐ రామకోటయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు సేకరించారు. అలానే 31 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ రామకోటయ్య గ్రామస్తులను హెచ్చరించారు. కార్డెన్ సెర్చ్ లో రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు తో పాటు 50 మంది పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.