యర్రగొండపాలెం: రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి దేవస్థానంలో కోనేరు పునర్నిర్మాణం
పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమల స్వామి దేవస్థానం సన్నిధిలో పాడుబడి ఉన్న పవిత్ర కోనేరు పునర్నిర్మాణం చేపట్టారు. రెండు లారీల కట్టుబడి రాళ్లను తీసుకురావడం జరిగిందన్నారు. దాతల సహకారంతో రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని సేవా కమిటీ సభ్యులు తెలిపారు.