కనిగిరి: కనిగిరిలో మహేంద్ర హత్యపై నిరసన వ్యక్తం చేసిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘీయులు మరియు నాయి బ్రాహ్మణ సాధికార సమితి సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఒంగోలు బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బొడ్డు చావిడి, నాజ్ సెంటర్, సుగుణావతమ్మ హాస్పిటల్ సెంటర్, వైయస్సార్ రోడ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సాగింది. ఆర్డీవో కార్యాలయంలో మరియు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.