దర్శి: దొనకొండ మండలంలో జూన్ 27వ తేదీ వరకు రైతన్న మీకోసం కార్యక్రమం : ఏవో బాలకృష్ణ నాయక్
Darsi, Prakasam | Jun 24, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జూన్ 27వ తేదీ వరకు రైతన్న మీకోసం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో గ్రామ రైతులతో మాట్లాడడం జరుగుతుందన్నారు. పంటలు సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో పండే పంటలను పండించుకోవాలని సూచించారు. 50 శాతం రాయితీతో వచ్చే విత్తనాలను వివరించారు.