తాడిపత్రి: చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు: యాడికి ఎంపీడీవో వీర్రాజు
చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, చేనేతలు దరఖాస్తు చేసుకోవాలని యాడికి ఎంపీడీవో వీర్రాజు చెప్పారు. యాడికి మండల పరిషత్ కార్యాలయంలో చేనేతలు, చేనేత కార్మికులతో గురువారం సమావేశం నిర్వహించారు. 200 యూనిట్ల వరకు విద్యుత్తు ను కాల్చేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.