రాయదుర్గం: పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో ఎలుగుబంటి హాల్ చల్
రాయదుర్గం పట్టణం గుమ్మగట్ట రోడ్డులో ఎలుగుబంటి హాల్ చల్ చేసింది. ఆదివారం రాత్రి బ్రిడ్జి దగ్గర వెళుతున్న వాహనదారులు కొందరు ఎలుగుబంటి సంచారం గమనించారు. దీంతో భయాందోళనకు గురై అక్కడే ఆగిపోయారు. హకొందరు కేకలు వేయడంతో పరుగులు తీస్తూ కురాకుల గుట్టవైపు వెళ్లింది. ఆదివారం సాయంత్రం కూడా రోడ్డు దాటుకుంటూ వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఫారెస్టు అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.