గిద్దలూరు: కంభం మండలం సైదాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం మండలం సైదాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.1.35 లక్షలు నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకృష్ణారెడ్డి తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్నారు.