యర్రగొండపాలెం: ఏనుగులదీన్నేపాడు గ్రామం నుండి పోతంపల్లి వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఏనుగులదిన్నెపాడు నుండి పోతంపల్లి వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 20 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొన్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు స్కూల్ కి వెళ్ళాలన్నా, వివిధ పనులకు వెళ్లాల్సి ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరారు.