గిద్దలూరు: గిద్దలూరుకు చెందిన మహిళపై దాడికి పాల్పడ్డ వ్యక్తికి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా విధించిన గిద్దలూరు కోర్టు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన చందా వెంకట రమణమ్మ అనే మహిళపై కర్రతో 2022లో దాడికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి భరత్ చంద్ర.. నేరం రుజువు కావడంతో మహిళపై కర్రతో దాడికి పాల్పడ్డ కోన చందు అనే వ్యక్తికి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష రూ.1000 ఒక్కొక్కరికి జరిమానా విధించారు.