కనిగిరి: కనిగిరి మండలం భూమిరెడ్డి పల్లి సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా కనిగిరి మండలం భూమిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. అట్లవారిపల్లి గ్రామానికి చెందిన వెన్నపూస అంకిరెడ్డి తన భార్య, మనమరాలితో కలిసి బైక్పై వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా బాధితులను కనిగిరి ఆసుపత్రికి తరలించారు.