యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఈవో చెన్నకేశవరెడ్డి తెలిపారు. జూన్ 8వ తేదీ 10 గంటలకు కొబ్బరికాయలు కూల్ డ్రింక్స్, ప్రసాదములు అమ్ముకునే హక్కు కు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు పదివేల రూపాయలు ధారావత్తు చెల్లించి పాల్గొనాలని పిలుపునిచ్చారు.