గిద్దలూరు: మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అధికారులు ప్రకటించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి
మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈనెల 27వ తేదీ ఉదయం 9:55 కు హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10:45కు దోర్నాలకు చేరుకుంటారు. 10 నిమిషాలు అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు సీఎం వస్తారు. మధ్యాహ్నం 12:20 నిమిషాల వరకు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వసితులతో మాట్లాడుతారు. 12: 35 కు దోర్నాల నుంచి క్రిష్టం శెట్టిపల్లి గ్రామానికి 12:55 కు చేరుకుంటారు. సంజీవిని ఆసుపత్రి ప్రారంభించి మధ్యాహ్నం 1:40 వరకు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతారు. తర్వాత 1:45 కు బహిరంగ సభ వేదిక వద్దకు వస్తారు. 3:35 నుంచి సాయంత్రం వరకు గార్డెన్ మీటింగ్లో పాల్గొంటారు.