మార్కాపురం: వద్దిమడుగు గ్రామానికి వెళ్లాలంటే రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామానికి వెళ్లాలంటే రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులన్నారు. కర్నూలు ఒంగోలు జాతీయ రహదారి నుండి గ్రామంలోనికి వెళ్లడానికి గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదు. వర్షాకాలంలో గుంతలలో నీరు చేరి కనపడక ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నారు.