రాయదుర్గం: ఐదేళ్ల పాలనలో దళితులను హింసించి నయవంచనకు గురిచేసిన జగన్ : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
జగన్ ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా రాజకీయ కుట్రలకు పావులు కావద్దని దళిత సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు రాయదుర్గం పట్టణంలో గురువారం నిర్వహించిన దళిత చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ... ఐదేళ్ల జగన్ పాలనలో దళితులపై అనేక దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.