రాయదుర్గం: కమనీయంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం, బాలికతో శ్రీవారి కల్యాణం
రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం మంగళవారం కమనీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేదపండితుల మంత్రోచ్చారణల మద్య శాస్త్రోక్తంగా ఈ కళ్యాణాన్ని జరిపించారు. ప్రతీ ఏడాదీ కొనసాగిన విధంగానే ఈ ఏడాదీ స్వామి వారికి బాలికతో వివాహం జరిపించారు. అరవా వంశానికి చెందిన నాగేష్, పావని ల కుమార్తె 9 ఏళ్ల స్వర జాహ్నవి అనే బాలికతో తో స్వామి వారికి కళ్యాణం జరిగింది. స్వామి వారికి పద్మశాలి అరవ వంశానికి చెందిన బాలికను ఇచ్చి వివాహం జరిపించే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతుండటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆలయ పెద్దలు దేవాదాయశాఖ అధికారులు ఈ ఏడాదీ ఈ ఆచారాన్ని కొనసాగించారు.