దర్శి: దొనకొండ మండల కేంద్రంలోని ఎయిర్ పోర్ట్ లో విమాన శిక్షణ కేంద్రం పరిశీలించిన అధికారులు
ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని ఎయిర్ పోర్టును విమాన శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళగిరి నుండి స్పెషల్ అధికారులు దొనకొండ కొచ్చి ఎయిర్ పోర్టును క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. శిక్షణకు అవసరమైన వసతులు మౌలిక వసతులను పరిశీలించామన్నారు.