యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో షార్ట్ సర్క్యూట్ తో బట్టల షాపు దగ్ధం, ఐదు లక్షల రూపాయలు నష్టం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బట్టల షాపులో మంటలు చెలరేగాయి. దుస్తులు సీలింగ్ విద్యుత్ వైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారి వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 5 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.