మార్కాపురం: మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 6 మందిని శుక్రవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తుల వద్ద నుంచి రూ.2,240 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.