దర్శి: చంద్రగిరి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ అందజేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చంద్రగిరి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్ అందుకున్న అవ్వ తాతల ఆనందాన్ని చూసి తనకెంతో గర్వకారణంగా ఉంది అన్నారు. ప్రతి ఇంట్లో సీఎం పెద్ద దిక్కుల క్రమం తప్పకుండా ఒకటో తేదీ పింఛన్ పంపిణీ చేస్తూ వారి బాగోగోలు తెలుసుకునే మహాభాగ్యం కల్పించారన్నారు.