దర్శి: దర్శి నియోజకవర్గంలో ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలంటూ ఐవిఆర్ కాల్స్ కలకలం
Darsi, Prakasam | Jun 12, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కూటమి ఇన్చార్జిగా గొట్టిపాటి లక్ష్మీ కావాలా లేక మాజీమంత్రి శ్రీనివాసరెడ్డి కావాలంటూ ప్రజలకు ఐ వి ఆర్ కాల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నియోజకవర్గంలోని టిడిపి జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు ఐ వి ఆర్ కాల్స్ ను కొందరు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి బాలమురళీకృష్ణ కు స్థానిక టిడిపి నాయకులు వినతి పత్రం అందజేశారు. గొట్టిపాటి లక్ష్మీ చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక నియోజకవర్గ ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి చూస్తున్నారని విమర్శించారు.