విశాఖపట్నం: భూమిని కాపాడుకుందాం: విద్యార్థులకు పిలుపునిచ్చిన గ్రీన్ క్లైమేట్ టీమ్
భీమునిపట్నంలోని కేథరిన్ విద్యా సంస్థలో ఓజోన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులకు తాటి పళ్లు నాటడం, విత్తన బంతుల తయారీపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి హరిత సైనికులుగా ఎదగాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ పిలుపునిచ్చింది.