దర్శి: ప్రమాదాలు జరగకుండా ప్రైవేటు బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపిన ఎస్సై ఏడుకొండలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరిగిందని ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రవాణా పోలీస్ శాఖ సంయుక్తంగా బస్సులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. లోపాలు ఉన్నవారు సర్దిద్దుకోవాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.