రాయదుర్గం: పట్టణంలో వైభవంగా ప్రసన్న వెంకటరమణ స్వామి మడుగుతేరు
రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మడుగుతేరు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. రథాంగ హోమాన్ని నిర్వహించి వినాయక కూడలి వరకు మడుగుతేరు లాగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.