కనిగిరి: కనిగిరిలో వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇన్ ఛార్జ్ నారాయణ యాదవ్
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నారాయణ యాదవ్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి టిడిపిపై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని అన్నారు. జగనన్న హయంలో పేదలు ఎంతో ఆనందంగా ఉన్నారని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. మళ్లీ 2029 ఎన్నికలలో జగనన్న గెలుస్తారని ఇంచార్జ్ పేర్కొన్నారు.