రాయదుర్గం: డి.హిరేహాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్టు
డి.హిరేహాల్ మండలం పులకుర్తి శివారులో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు డిఎస్పీ రవిబాబు రూరల్ సీఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, నబీరసూల్ తో కలసి వెల్లడించారు నేర స్థలంలో లభించిన అప్పడాల ప్యాకెట్ కీలక ఆధారమైందన్నారు. దాని ఆధారంగా బళ్లారికి చెందిన మూగ-చెవిటి వ్యక్తి గురురాజు రావుగా గుర్తించారు. ATM లావాదేవీలు, CCTV, కాల్ డేటా విశ్లేషణతో బళ్లారికి చెందిన బసవరాజు, కొట్రేష్ లను అరెస్ట్ చేశారు. డబ్బు కోసం పార్టీ పేరుతో తీసుకెళ్లి కారం చల్లి, గొంతు బిగించి హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టినట్లు తెలిపారు.