మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రణ ప్రతాప విగ్రహం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు, ప్రారంభించాలని స్థానికులు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ ముందు రోడ్డు డివైడర్ లో నూతనంగా రాణా ప్రతాప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సింగ్ సేవ సంఘం సమన్వయ లోపంతో ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం పైగా అవుతున్న ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో విగ్రహం ఎండకు వానకు తడిసి శిథిలావస్థకు చేరే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా సేవా సంఘం నాయకులు విగ్రహం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరారు.